ఏసీబీ అధికారులకు ధన్యవాదాలు: సిపిఎం గుండాల మండల కార్యదర్శి తోలం గోపి

ఏసీబీ అధికారులకు ధన్యవాదాలు:
సిపిఎం గుండాల మండల కార్యదర్శి తోలం గోపి 

*గుండాల మండలం మే 1(స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

మండలం లో గతరెండు రెండు సంవత్సరాల నుండి ఫారెస్ట్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక మరియు బెందడ రాయి మరియు ప్రజల అవసరాల నిమిత్తం ఇంట్లో కట్టెలు తీసుకొస్తున్న సందర్భంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు  అధికార సిబ్బంది ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.  ఇలాంటి సందర్భంలో ఏసీబీ అధికారులు గుండాల మండలానికి రావటం అవినీతి అధికారులను పట్టుకోవడం శుభపరిణామం అని సిపిఎం గుండాల మండల కార్యదర్శి తోలం గోపి పేర్కొన్నారు. ఇలాంటి అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని సీపీయం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావాలంటే 30 నుంచి 50 వేల రూపాయలు లంచం ఇవ్వాల్సిందేనని పైరవీకారుల పేరుతో సామాన్య ప్రజలను వేధిస్తున్న సంగతి జరుగుతుంది. ఇట్టి నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా న్యాయమైన సమస్యల కోసం పోరాటాల్లోకి రావాలని అవసరాన్ని బట్టి ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సిన అవసరం అసన్నమైందని ఈరోజు జరిగినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  పదివేల లంచం విషయం  విషయంలో పట్టుబడటంతో మనందరకు తెలియజేస్తుంది. కావున ప్రజలు వారి హక్కుల కోసం వారి సమస్యలపై మేడే కార్మికుల స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మే ఫస్ట్ తారీఖున సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో మేడే ర్యాలీలో 
కార్మికులు, కర్షకులు ,రైతులు వ్యవసాయ కూలీలు, కూలీలు,ఆదివాసి గిరిజనులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు