మణుగూరులో ట్రాక్టర్ నడిపి ఆకట్టుకున్న రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి

మణుగూరులో ట్రాక్టర్ నడిపి ఆకట్టుకున్న రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి
మణుగూరు ప్రతినిధి:
Renuka Chowdhury మణుగూరు పట్టణంలో పర్యటించి స్థానికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆమె వర్గీయులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి భారీగా పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం రేణుక చౌదరి ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె ట్రాక్టర్ నడిపిన దృశ్యాలు స్థానికులను ఆకర్షించగా, పలువురు చప్పట్లతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఆమె పర్యటనతో మణుగూరు పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు