అమెరికాలో నిర్వహించిన ‘తెలుగు యూఎస్ఏ’ అందాల పోటీల్లో పల్నాడు జిల్లాకు చెందిన యువతి దివ్యశ్రీ రన్నరప్‌గా నిలిచి ప్రతిభ చాటారు.
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన దివ్యశ్రీ ప్రస్తుతం అమెరికాలో ఐటీ రంగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆరు నెలల పాటు జరిగిన ఈ పోటీల్లో అందం, వ్యక్తిత్వం, ప్రతిభ, తెలివితేటల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈ విజయంపై దివ్యశ్రీ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పల్నాడు జిల్లాకు ఇది గర్వకారణమని పేర్కొన్నారు.
#Divyashree #Palnadu #TeluguUSA #BeautyPageant #RunnerUp #TeluguPride #AndhraPradesh #Chilakaluripet #Linganguntla #WomenAchievement #IndianAbroad #ProudMoment #TeluguTalent #sbnews
0 కామెంట్‌లు