భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల నూతన తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన జి. శ్రీనివాసరెడ్డి గారిని జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు.
పినపాక మండలం పూర్తిగా 5వ షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నందున, ఆదివాసీ గిరిజనుల హక్కులను రక్షించే చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని నాయకులు కోరారు. ముఖ్యంగా భూ బదలాయింపు నిషేధ చట్టాలు 1/59, 1/70 మరియు POT 1/77లను పటిష్టంగా అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా అధ్యక్షులు గొగ్గల ఆర్కే దొర, పినపాక మండల అధ్యక్షులు కొమరం శ్రీను, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నూతన తహశీల్దార్ జి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఆదివాసీ ప్రాంతాల్లో చట్టాల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
0 కామెంట్‌లు