గుండాలలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
గుండాల మండలం ఏప్రిల్ 14 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బొమ్మేర్ల నాగేష్, ఉపాధ్యక్షుడు కొండ్రు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ నాయకులు ప్రసంగించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, సీఐ తిరుపతి, ఎస్ఐ సైదారావుఫ్, ఎంపీడీవో బాలరాజు, ఎంఈఓ కే పార్వతమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే బీఎస్పీ నాయకులు బొమ్మేర్ల రాంబాబు, తుడుం దెబ్బ నాయకులు వజ్జ ఎర్రయ్య, రజక సంఘం నాయకులు గడ్డం లాలయ్య, గౌడ సంఘం నాయకులు బత్తిని సాయన్న, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం వీరన్న, సిపిఐ పార్టీ నాయకులు గడ్డం శీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసిం, తవిడిశెట్టి నాగరాజు, రాంబాబు, నరసింహారావు, సుధాకర్, వై వెంకన్న, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బొమ్మేర్ల సత్యం, రాములు, వానపాకుల లాలయ్య, నరం దాస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు కూడా భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
0 కామెంట్‌లు