మణుగూరు శివలింగాపురం ఆలయ పరిసరాల్లో సీతారాముల కల్యాణం సందర్భంగా ముత్తయిదువులు సంప్రదాయబద్ధంగా రోకలికి పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు కొమ్ములను దంచి పవిత్రమైన పసుపు పొడిని తయారు చేశారు. ఈ పసుపును సీతారాముల కల్యాణ తలంబ్రాలలో వినియోగిస్తారు.
ఈ కార్యక్రమంలో లలితమ్మ, భానోత్ జ్యోతి, స్వరూప, ఫణిత, రాజేశ్వరి, అరుణ, మంగమ్మ పాల్గొన్నారు. అలాగే అర్చకులు నందల లక్ష్మణరావు ఆధ్వర్యంలో బానోతు లక్ష్మణ్, రామిరెడ్డి, దుర్గారావు, ప్రసాద్, సత్యం, చంద్రశేఖర్, సంగయ్య, రామంచి బిట్టు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
#SeetharamulaKalyanam #Manuguru #Tradition #TelanganaCulture #TempleEvents
0 కామెంట్‌లు