కారేపల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 22వ తేదీ (ఆదివారం) ఉచిత ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Mission Walk Foundation మరియు Mission Walk – Neuro Rehab ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతుంది. సంస్థ స్థాపకులు, న్యూరో రిహాబిలిటేషన్ నిపుణులు డా. రవి బాదవత్ (15 సంవత్సరాల అనుభవం కలిగిన న్యూరో ఫిజియోథెరపీ నిపుణులు) పర్యవేక్షణలో వైద్య సేవలు అందించనున్నారు.
మొట్టమొదటిసారిగా కారేపల్లిలో రోబోటిక్ సాయంతో చికిత్స సేవలు అందించబడనున్నాయని నిర్వాహకులు తెలిపారు. మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చికిత్స అందించబడే సమస్యలు:
న్యూరో సంబంధిత సమస్యలు:
పక్షవాతం, స్ట్రోక్, వెన్నెముక గాయాలు, తల గాయాలు, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, నరాల బలహీనత, మెదడు శస్త్రచికిత్స అనంతర బలహీనత.
ఆర్థో సమస్యలు:
మోకాలి నొప్పి, ఎముక విరుగుడు తర్వాత బలహీనత, వెన్నునొప్పి/సయాటికా, జాయింట్ రీప్లేస్‌మెంట్ తర్వాత రిహాబిలిటేషన్, భుజం/మెడ నొప్పులు, క్రీడల గాయాలు.
పిల్లల సమస్యలు:
సెరెబ్రల్ పాల్సీ, ఆటిజం, డెవలప్‌మెంట్ డిలే, ఆలస్యంగా నడక/మాట్లాడటం, మసిల్ బలహీనత, జన్యు సమస్యలు, పుట్టుకతో వచ్చిన కాళ్ల వంకరలు.
శిబిరంలో అందించబడే సేవలు:
ఉచిత ఫిజియోథెరపీ పరీక్ష
న్యూరో & ఆర్థో నిపుణుల సలహా
ఆధునిక రోబోటిక్ రిహాబిలిటేషన్ వివరాలు
వ్యక్తిగత చికిత్స మార్గదర్శకాలు
ఇప్పటివరకు సరైన చికిత్స పొందలేక ఇబ్బందులు పడుతున్న వారు, నడవాలని ఆశతో ఉన్న వారు, పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.
📍 స్థలం: ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, కారేపల్లి
📅 తేదీ: 22-02-2026 (ఆదివారం)
📞 నమోదు కోసం: 91773 00194
ప్రజలు ఈ సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులు, పొరుగువారికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
Mission Walk – ప్రతి అడుగులో ఆశ, ప్రతి జీవితానికి మార్పు
0 కామెంట్‌లు