భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (BTPS) ప్రధాన గేట్ ముందు సీ ఐ టీ యూ (CITU) ఆధ్వర్యంలో కార్మికులు మెరుపు ధర్నా చేపట్టారు. కాంట్రాక్టర్‌లు గత ఆరు నెలలుగా తమకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆరోపించారు. వేతనాలు ఆలస్యమవడంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మె కారణంగా కొంతసేపు ప్లాంట్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులు తమ బకాయిలను వెంటనే చెల్లించాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న అధికారులు, కాంట్రాక్టర్ ప్రతినిధులతో చర్చలు జరిపి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
0 కామెంట్‌లు