-ప్రధాన మంత్రి నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన
మణుగూరు, 16-02-26: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మణుగూరులో అంబేద్కర్ విగ్రహం ముందు మౌన నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభా ఉల్లంఘన నోటీసులు జారీ చేసిన రాహుల్ గాంధీ, రేణుకా చౌదరిలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకుడు గురిజాల గోపి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాల స్వరాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. సీనియర్ నాయకులపై అనవసర ఆరోపణలు చేయడం ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనం సరోజ, ఎండి షబానా, కోరి శ్యామల, డేరంగుల సుజాత, రెడ్డీబోయిన రేణుక, కన్నాపురం శైలజ, సౌజన్య, లక్కీశెట్టి హేమలత, సీనియర్ నాయకులు ఎండీ షేరిఫ్, పింగళి మాధవ రెడ్డి, వెంకట చారి, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.#మణుగూరు
#మౌననిరసన
#కాంగ్రెస్‌పార్టీ
#ప్రజాస్వామ్యరక్షణ
#నిరంకుశనిర్ణయాలు
#రాహుల్‌గాంధీ
#రేణుకాచౌదరి
#అంబేద్కర్‌విగ్రహం
#జిల్లానాయకులు
#ప్రజాహక్కులు
0 కామెంట్‌లు