ప్రజలే కాంగ్రెస్ పార్టీ బలమని, ప్రజా సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే పాయం

ప్రజలే కాంగ్రెస్ పార్టీ బలమని, ప్రజా సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే పాయం


జనగామ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. జనగామ అబ్జర్వర్‌గా నియమితులైన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు 22వ, 19వ, 14వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని త్వరితగతిన పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలే కాంగ్రెస్ పార్టీ బలమని, ప్రజా సంక్షేమమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం 14వ, 19వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం జనగామలో రాజకీయ ఉత్సాహాన్ని నింపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు