పినపాక మండలం పొట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డిగూడెం గ్రామంలో గ్రామస్తుల ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రావెల్ రోడ్డు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. వర్షాకాలంలో మట్టి బురద కారణంగా గ్రామంలో రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగించడంతో పాటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, రైతులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ మద్దెల సమ్మయ్య గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకుని గ్రావెల్ రోడ్డు వేయించారు.
ఈ పనులు ఉపసర్పంచ్ కోరిపెల్లి రవీందర్, పంచాయతీ కార్యదర్శి సందీప్ పర్యవేక్షణలో నాణ్యత ప్రమాణాలతో చేపట్టబడినట్లు తెలిపారు. రోడ్డు పనుల సమయంలో ప్రజల సూచనలు కూడా స్వీకరించి, అవసరమైన మార్పులు చేసి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ రహదారి ఏర్పాటుతో గ్రామంలో అంతర్గత రాకపోకలు సులభతరమవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వంటి వాహనాలు సులభంగా చేరుకునే వీలుకల్పించబడింది.
గ్రామస్తులు సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు పంచాయతీ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామాభివృద్ధి పనులు ఇలాగే కొనసాగాలని కోరారు. భవిష్యత్తులో డ్రైనేజ్, వీధి లైట్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని పంచాయతీ ప్రతినిధులు తెలిపారు. గ్రామ అభివృద్ధి దిశగా ఈ గ్రావెల్ రోడ్డు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది.
0 కామెంట్‌లు