మాటలకే పరిమితం అవుతున్న కాంగ్రెస్ మాటలు

మాటలకే పరిమితం అవుతున్న కాంగ్రెస్ మాటలు
- అభివృద్ధి నీ గాలికి వదిలి మాయ మాటలతో  కాలాయాపన చేస్తున్న కాంగ్రెస్
- గుండాల మాజీ సర్పంచ్ కోరం సీతారాములు.
గుండాల మండలం డిసెంబర్ 15 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అత్యంత మారుమూల గుండాల మండలం. గుండాల మండలంలో పాలకులు ముఖ్యం గా కాంగ్రెస్ పార్టీ అనేక మాయమాటలు చెప్పి వాగ్ధనాలహామీలు ఇచ్చి అభివృద్ధి లో వెనుకంజ వేశారు. పినపాక నుండి గుండాల వరకు సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న కూడా స్థానిక శాసన సభ్యులు ఏమాత్రం పట్టించుకో కుండా నిమ్మకు నీరెత్తినట్లునిర్లక్ష్యం చేస్తున్నారు. గుండాల గ్రామ పంచాయతీ లో డ్రైనేజి లు ఇతర అనేక సమస్యలు ఎమ్మెల్యే దృష్టికీ తీసుకు పోయిన కూడా పరిష్కారం చేయకుండా నేడు ఎన్నికలలో కమ్యూనిస్ట్ ల పై నిరధార ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని గుండాల మాజీ సర్పంచ్ కోరం సీతారాములు అన్నారు. గుండాల మండలం లో ఇందిరమ్మ ఇల్లు ఒక్కటీ కూడా పూర్తి కాకుండా నిర్లక్ష్యం చేస్తూ, ఇందిరమ్మ ఇల్లు లో అనేక అవినీతి అక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల నూ ప్రజా సమస్యలు నూ గాలికి వదిలేసిందనీ అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారం లో కీ వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా నేడు మళ్ళీ స్థానిక ఎన్నికలలోకమ్యూనిస్ట్ పార్టీ లపై ఆరోపణలు చేయడం తగదని అన్నారు. గుండాల మండలం లో న్యూడేమోక్రసి పార్టీ అనేక ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల వెన్నంటే ఉంటూ ప్రజలతో ఉన్న మా పార్టీ పై నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు గమనిస్తూ ఉన్నారని అన్నారు.గుండాల మండలం లో విప్లవ ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజలలో ఉంటూ సమగ్ర అభివృద్ధి కాంక్షించే సీపీఐ యం యల్ న్యూడేమోక్రసి పార్టీ కీ ప్రజలు పట్టం కట్టాలనీ, సర్పంచ్ అభ్యర్థులనూ, వార్డ్ సభ్యులు నూ ప్రజలు అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరం సీతారాములు అన్నారు.