Subscribe Us

SB LATEST:

23, డిసెంబర్ 2025, మంగళవారం

పినపాకలో పేదలకు రామకృష్ణ మెమోరియల్ ఫౌండేషన్ సేవలు

పినపాకలో పేదలకు రామకృష్ణ మెమోరియల్ ఫౌండేషన్ సేవలు
పినపాక:పినపాక మండల పరిధిలోని అమరారం గ్రామపంచాయతీ కొత్తూరు కాలనీలో మంగళవారం రామకృష్ణ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ అరుణ నేతృత్వంలో గ్రామస్తులకు దుస్తులు, దుప్పట్లు, చలి కోట్లు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ, తమ సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం మరిన్ని ఉచిత సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యంగా చలికాలంలో అవసరమైన దుస్తులు, దుప్పట్లు అందించడం ద్వారా నిరుపేద కుటుంబాలకు ఉపశమనాన్ని కలిగించడమే లక్ష్యమని పేర్కొన్నారు.సేవా కార్యక్రమం సందర్భంగా సహాయం అందుకున్న గ్రామస్తులు ట్రస్ట్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనానికి తోడ్పడతాయని వారు అభిప్రాయపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యతతో ముందుకు వస్తున్న సేవా సంస్థల కృషి అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కాయం అరుణతో పాటు కాయం భవాని, సోయం పప్పి, కాయం శేఖర్, కొట్టెం ప్రసాద్, బిజ్జ రామారావు, బిజ్జ రమేష్, సోయం సుదర్శన్, చింత ముత్తయ్య, రేగా సుదర్శన్, రేగా నారాయణ, తాటి సందీప్, రేగా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.