తీజ్ పండగ ఏర్పాటుచేసిన ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని ఏ ఎస్ పి డిమాండ్.
గుండాల మండలం ఆగస్టు 16 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
గుండాల మండలం రెసిడెన్షియల్ స్కూల్లో ఎటువంటి ముందస్తు ప్రభుత్వ అనుమతులు లేకుండా ముత్తాపురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో తీజ్ పండుగ వేడుకలను నిర్వహించడంపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు పూనెం రమణ బాబు మరియు ముత్తాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ కల్తీ రాధ, ఉప సర్పంచ్ తాటి రమేష్, వార్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గిరిజన సంస్కృతి, విద్యా ప్రమాణాలను రక్షించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇటువంటి అనధికారిక కార్యక్రమాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని ఆదివాసీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. పాఠశాల యాజమాన్యం లేదా ఉన్నతాధికారుల నుండి ఎలాంటి లిఖితపూర్వక అనుమతులు జీ వో లు లేకుండా అనుమతి తీసుకోకుండా ఈ వేడుకలను నిర్వహించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల అతిక్రమణ గిరిజన సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల ఆవరణలను రాజకీయ లేదా ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు ఉపయోగించకూడదనే నిబంధనలను ఇక్కడ ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. సంస్కృతి, విద్యా వాతావరణం విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగించేలా ముందస్తు ప్రణాళిక లేకుండా ఇలాంటి కార్యక్రమాలను అనుమతించడం విద్యాసంస్థ నిధులను వృధాగా ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల పాఠశాల క్రమశిక్షణ దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన పాఠశాల సిబ్బంది లేదా నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు పూనెం రమణ బాబు, ముత్తాపురం సర్పంచ్ వార్డు సభ్యులు ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల కమిటీ సభ్యులు జబ్బ సుదర్శన్, గోగ్గేలా సుధాకర్, తాటి భాస్కర్ పాల్గొని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను డిమాండ్ చేశారు.
0 కామెంట్‌లు