కాంగ్రెస్ పార్టీ నూతన ప్రింటర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, లీగల్ సేల్ కమిటీ ఎన్నిక

 స్వాతంత్ర్య భారత్ ప్రతినిధి ఆగస్టు 15 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ఓరుగంటి వీరయ్య భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు ఆధ్వర్యంలో నూతన మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.లీగల్ సెల్ మండల అధ్యక్షుడిగా సింగం శ్రీధర్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మండల అధ్యక్షుడిగా పర్సబోయిన రాధాకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బచ్చలకూరి వెంకట్, కడారి నగేష్, ప్రధాన కార్యదర్శులుగా అండెం గంగరాజు, సున్న నరేష్, కార్యదర్శులుగా జిల్లేపల్లి ఓం ప్రకాష్ చారి, రావులపల్లి నరసింహారావు, గడకారి రామకృష్ణ, కోశాధికారిగా గొల్లపల్లి నరేష్ కుమార్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ సభ్యులంతా సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం పార్టీ నాయకులు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు