అశ్వాపురం: పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం రాత్రి మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలించి, రైతులకు త్వరితగతిన సాగునీరు అందించడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు అధికారులతో మమేకమై రైతులకు నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు.
తుమ్మలచెరువుకు నీటిని అందించడంతో పాటు రైతులకు మేలు జరిగేలా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేసి రైతులకు నీరు అందించేలా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, మాజీ ఎంపీపీ ఊసా అనిల్ కుమార్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కంటెం నవీన్, కంబనీ సత్యనారాయణ మరియు సైట్ ఇన్చార్జి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు