నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, BJYM ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. BJYM జిల్లా అధ్యక్షులు ధన్నోజు నరేష్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో కలిసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. “ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి” అనే నినాదంతో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, బీజేపీ, BJYM నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి జాతీయ నేత తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నరేందర్ రావుతో పాటు పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ, BJYM నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. దీంతో దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులతో పాటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులకు హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. వెంటనే నిధులు విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడటం తగదని నాయకులు అన్నారు. బకాయిల విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు BJYM ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు రావాల్సిన నిధులు మంజూరు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శులు గోరటి నరసింహ, నాగరాజు గౌడ్, నకిరేకంటి శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
BJYM రాష్ట్ర నాయకులు భగీరథ, పార్లమెంట్ కో-కన్వీనర్ రవి రాథోడ్, BJYM కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్, మండల అధ్యక్షులు ప్రమోద్, భరత్, అరుణ్, ప్రేమ్ రాజ్, సుదర్శన్‌తో పాటు BJYM నాయకులు శివాజీ, రాకేష్, శ్రీను, నిశ్వంత్, విజేందర్, ప్రశాంత్, నరసింహ, సాయి, రవి, మల్లేష్, శివకుమార్, అరవింద్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, యువతతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
0 కామెంట్‌లు