అర్ధరాత్రి అరెస్ట్ లు ఉద్యమాన్ని ఆపలేవు: ఆదివాసీ నాయకులు

గుండాల మండలం ఆగస్టు 23 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:

 గుండాల మండలం ముత్తాపురం గ్రామం ఏకలవ్య మోడల్  రెసిడెన్షియల్ స్కూల్ వద్ద శనివారం ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు పూనేం రమణ బాబు ఆధ్వర్యంలో  విలేకరుల సమావేశం  నిర్వహించగా, ఈ సమావేశంలో కోడెం వెంకటేశ్వర్లు తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వాగబోయిన చంద్రయ్య దొర ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు పాల్గొని మాట్లాడుతూ, గత నాలుగు రోజుల నుండి ముత్తాపురం ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ నందు జరుగుతున్న ధర్నాని శుక్రవారం అర్ధరాత్రి సమయంలో  పోలీస్ అధికారులు భగ్నం చేయడం జరిగింది, అర్ధరాత్రి అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని న్యాయం ఎప్పటికీ గెలుస్తుందని ఆదివాసీ నాయకులు ఎ పి ఓ, ఆర్సిఓతో చర్చలు జరపగ, ధర్నాని విరమించుకోండి ఏవైతే తీజ్ పండగ మరియు ఆదివాసి పిల్లలపై కుల వివక్షత చూపెడుతున్న ఉపాధ్యాయులను ఉన్నత అధికారులతో సమగ్ర విచారణ జరిపి వాళ్లని నిధులనుండి తొలగించే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వగా తొలగించే వరకు మా ధర్నాని విరమించుకోమని ఆదివాసి నాయకులు 9 తెగల జేఏసీ చైర్మన్  చుంచు రామకృష్ణ మరియు అక్కడి సంఘాలకు కమిటీ సభ్యులు చెప్పడంతో వాళ్లను అర్ధరాత్రి రెండున్నర సమయంలో అరెస్టు చేయడం సరికాదని తప్పు చేసిన ఉపాధ్యాయులను స్కూలు ఆవరణలో ఉంచుకొని ఉద్యమాన్ని ఆపడం కోసం ఉద్యమకారులను నాయకులను అరెస్టు చేయటం సరైనది కాదని, తప్పు చేసిన ఉపాధ్యాయులను అరెస్టు చేయకుండా సజావుగా విధులను నిర్వర్తిస్తుంటే అధికారులు చోద్యం చేస్తున్నారా అని మండిపడ్డారు. తక్షణమే ఉపాధ్యాయులని తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులకు గుర్తు చేశారు, అనంతరం అధికారులు ఏదైనా తప్పు జరిగి  ఉంటే ఉపాధ్యాయులను విధుల నుండి తొలగిస్తమని శనివారం  హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు  లింగగూడెం సర్పంచ్ చింత వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మొక్కా ళ్ళ వీరస్వామి మండల నాయకులు నరేష్, సయ్యద్ అజ్జు,గోగ్గేలా రమేష్ కాంగ్రెస్ నాయకులు ఈసం రాజబాబు, తెల్లం కిరణ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు