"మహిళలను అడ్డుపెట్టుకుని చెత్త రాజకీయాలు మానుకోవాలి"
"రేగా కాంతారావుపై రాజకీయ కక్షతో ఆరోపణలు చేస్తున్నారు" – బీఆర్ఎస్ నాయకులు
అశ్వాపురం: మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం చెత్త రాజకీయాలకు పాల్పడడం సరికాదని, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఆరోపణలు రాజకీయ కక్షసాధింపులో భాగమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో నెల్లిపాక మాజీ సర్పంచ్ గొర్రెముచ్చు వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ గొర్రెముచ్చు వెంకటరమణ, గ్రామ శాఖ అధ్యక్షుడు గజ్జెల నాగరాజు మాట్లాడుతూ, దర్యాప్తు పూర్తికాకముందే ఎవరినైనా దోషిగా చిత్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు అసత్య ఆరోపణలు, అబద్ధపు ప్రచారాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. ఇటువంటి ప్రచారాల ద్వారా తాత్కాలిక రాజకీయ ప్రయోజనం పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, నిజానిజాలను గుర్తించే తీర్పు ప్రజలదేనని అన్నారు.
గిరిజన నాయకుడి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం బాధ్యతాయుతమైన రాజకీయాలకు ఏమాత్రం తగదని వారు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననం కాకుండా ప్రజా సమస్యలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై రాజకీయ కక్షతో ఎలాంటి ప్రచారాలు చేసినా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి, తమ నాయకత్వానికి ఉన్న ఆదరణ తగ్గదని వారు పేర్కొన్నారు. రాజకీయ కక్షతో చేసే ప్రతి ప్రయత్నానికీ ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
0 కామెంట్‌లు