జలగం వెంగళరావు మెమోరియల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.
గుండాల మండలం ఆగస్టు 6 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
జలగం వెంగళరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జలగం ప్రసాద్ రావు గారి సారథ్యంలో గుండాల రైతులకు సబ్సిడీపై ఇచ్చిన 16 మోటర్లను గుండాల సర్పంచ్ కోరం సీతారాములు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వెంగళరావు ట్రస్టు ద్వారా గిరిజన గిరిజన నేతలకు మోటర్లు ఇవ్వడం అర్చించదగ్గ విషయం అన్నారు. రైతులు మోటాలను ఉపయోగించుకొని వ్యవసాయంలో అభివృద్ధి చెందాలని కోరారు ఈ కార్యక్రమంలో గోవింద నరసింహారావు మాట్లాడుతూ జలగం వెంగళరావు మెమోరియల్ ట్రస్టు ద్వారా జలగం ప్రసాదరావు గారు మారుమూల ప్రాంతమైన గుండాల మండలంలో విద్యుత్ లైన్లు ఏర్పాటుతోపాటు విద్యుత్ మోటార్లు సబ్సిడీపై అందించడం అభినందనీయమన్నారు రైతుల ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు మీసం కృష్ణ, బొబ్బిలి సమ్మయ్య, గడ్డం సమ్మయ్య, గడ్డం కృష్ణ, గుర్రం రాములు, నిట్ట వెంకన్న, ఎస్ డి కుద్దూస్, ఈ సం సమ్మయ్య, తౌడుశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు