– చీఫ్ ఇంజనీర్‌కు లోకల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వినతిపత్రం
మణుగూరు బీటీపీఎస్‌లో నిర్వహించే అన్ని అప్‌కీపింగ్ పనులను బీటీపీఎస్ నిర్వాసిత గ్రామాలకు చెందిన స్థానిక కాంట్రాక్టర్లకే కేటాయించాలని
బీటీపీఎస్ లోకల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. శనివారం మణుగూరు బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్థానికులకు కాంట్రాక్ట్ లు కేటాయించడం వల్ల నిర్వాసిత గ్రామాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, స్థానికులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బీటీపీఎస్ ఏర్పాటుకు భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానిక కాంట్రాక్టర్లకు తగిన అవకాశాలు కల్పించాలని సిఈ ని కోరుతూ మెమొరాండం సమర్పించారు.ఈ కార్యక్రమంలో లోకల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.#BTPS #Manuguru #LocalContractors #BTPSContractors #DisplacedVillages #Employment #YouthEmployment #BhadradriKothagudem #Telangana #LocalJobs #BTPSNews #SBNews #TeluguNews #ManuguruNews #ContractorsAssociation #JobsForLocals #Development #Memorandum #BreakingNews #Pinapaka
0 కామెంట్‌లు