నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి

నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి

గుండాలలో పీవైఎల్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ


గుండాల మండలం జులై 22 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:


నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గుండాల మండల కేంద్రంలో ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన నిరసన సభలో పీవైఎల్ జిల్లా కార్యదర్శి పర్శిక రవి, ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షుడు గడ్డం లాలయ్య, ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం (ఏఐటీఎఫ్) రాష్ట్ర నాయకుడు కృష్ణ మాట్లాడుతూ, నీట్ పరీక్ష కోసం లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమవుతారని, అలాంటి పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల వారి భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నీట్ పేపర్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఆందోళనలు చేపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. పార్లమెంట్ సమీపంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు తాటి రమేష్, కల్తి ప్రమోద్, ముక్తి జనార్ధన్, కుంజ వెంకటేశ్వర్లు, కల్తి రాంబాబు, కల్తి ప్రభాకర్, కోరం సురేందర్, పీడీఎస్‌యూ నాయకులు బత్తుల ప్రమోద్, గామాలపాటి మున్నా, ఎం.డి. షాహిద్, హర్షవర్ధన్, జితేష్, భాస్కర్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు