"ప్రశ్నించే యువతే ప్రజాస్వామ్యానికి బలం – విద్యావంతుల నాయకత్వంతోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు"
'ఈ దేశం యువతది'... శ్రీశ్రీ మాటలకు నేటి యువత నిదర్శనం
యువత సంకల్పం ముందు అధికారమే తలవంచింది
ప్రశ్నించండి... పోరాడండి... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.
రాజ్యాంగం తెలిసిన యువతే సమర్థ నాయకత్వం అందించగలరు
యువత రాజకీయాల్లోకి వస్తే మారేది దేశ భవిష్యత్తే
జెన్-జీ ఉద్యమం: యువత పట్టుదలకు చారిత్రక విజయం
గుండాల మండలం జులై 28 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
యువతరం- కొత్తతరం రాజకీయం
అనుభవం లేని యువత రాజకీయాల్లోకి వస్తే అపారమైన నష్టాలు కలుగుతాయి, అదే అనుభవం గల వ్యక్తులు ఉంటే సామర్థవంతంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరు ఆలోచన ఉంటుంది. అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వ్యక్తులు యువతకు సమాజంలో సాధించవలసినటువంటి విషయాల పట్ల దిశా నిర్దేశం చేయవలసింది పోయి వారు నిరాశ చెందే విధంగా మాట్లాడుతే వారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. యువత సాధించాలి అని పట్టుబడుతే ఎంతవరకు వెళ్లగలరు అన్న దానికి నిదర్శనమే 25-07-2026 మధ్యాహ్నం 2:18 నిముషాలకు వచ్చినటువంటి ఫలితం యువత విజయాన్ని ముద్దాడింది, యువతలో ఉన్న ధైర్యాన్ని, సామర్ధ్యాన్ని, పట్టుదలని ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రజాస్వామ్యం గెలిచింది.ఒకవేళ చనిపోయిన వారి యొక్క ఆత్మలు ఉండి ఉంటే రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ గారి ఆత్మ సంతోషపడుతుంది. ఇలాంటి విజయాన్ని చూసి ఇప్పుడు గర్వంగా చెప్పొచ్చు యువత రాజకీయాల్లోకి రావచ్చని, ఒకవేళ యువత రాజకీయాల్లోకి వస్తే ఏం సాధించగలరో, శ్రీశ్రీ గారు అన్నట్లు "ఈ దేశం ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరిపోతులది కాదు ఈ దేశం యువతది" ఏటువంటి దేశాన్ని భవిష్యత్తు తరాలకు రాజకీయ నాయకులు అందించాలనుకుంటున్నారు ఒకప్పుడు పోలీసులను చూస్తే సామాన్యుడు భయపడేవాడు, ఇప్పుడు పోలీసులు రాజకీయ నాయకులు చూసి భయపడుతున్నారు, పోలీసుల చేతిలో ఉండవలసిన తుపాకులు ఫ్యాక్షనిస్టుల చేతుల్లో పెట్టి దేశాన్ని హత్య రాజకీయ వాదులు చేతుల్లో పెడుతున్నాం, సరేనా ఎడ్యుకేషన్ లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు, పరిపాలనలో సరైన విధానం తెలియని వారు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, రాజకీయాల్లోకి వచ్చే వారికి కూడా విద్య అర్హతలు ఏర్పాటు చేయాలి, అంబేద్కర్ గారు అన్నట్టు "విజ్ఞానించు, ఉద్యమించు, వ్యవస్థీకరించు" విద్య లేని వాడికి ఒక వ్యవస్థ పట్ల ఏ విధంగా అవగాహన ఉంటుంది, ఏ విధంగా పరిపాలించగలడు. ముఖ్యంగా రాజకీయాల్లో రౌడీలు, గుండాలు ఎక్కువగా చేరి దేశాన్ని రణరంగంలో మారుస్తున్నారు,వ్యవస్థల్ని బ్రష్టు పట్టిస్తున్నారు. తండ్రి చనిపోతే కొడుకుకి భర్త చనిపోతే భార్యకు ఇలా పదవులు పంచుకుంటూ పోతే దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్న సామాన్య మానవుడికి అవకాశం లేకుండా పోతుంది. ఒకప్పుడు భారతదేశం ఆర్థికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది భారతదేశాన్ని అన్నపూర్ణగా అభివర్ణిస్తారు,ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయాన్ని నమ్ముకునేవారు కానీ ఇప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు ఏడు తరాలకు సరిపోయే ఆస్తి సంపాదించుకోవచ్చని అర్హత లేని రౌడీలు, గుండాలు రాజకీయాల్లోకి వస్తున్నారు, ఒక సామాన్య మానవుడు రాజకీయాలు రావాలంటే భయపడుతున్నారు, నా జీవితం మొత్తం దేశ సేవకి అంకితం అంటూ బిడ్డల్ని కూడా కనకుండా దేశ సేవ చేసిన పుచ్చలపల్లి సుందరయ్య, కట్టు బట్టలు తప్ప కార్లు ,మోడలు ఆశించనీ వావిలాల గోపాలకృష్ణయ్య, రెండుసార్లు ప్రధానమంత్రిగా చేసి సొంత ఇల్లు కూడా లేని గుల్జారీలాల్ నందా, భగత్ సింగ్, ప్రకాశం పంతులు, అంబేద్కర్ లాంటి నాయకులు ఈ దేశానికి అవసరం, ఇటువంటి వ్యక్తిత్వాలున్న యువత రాజకీయానలోకి రావాలి, ఢిల్లీ నడిబొడ్డున వేలాది మంది యువతరం నిరసనలు, ఆందోళనలకి ముఖ్య కారణం కొన్ని ముఖ్యమైన వ్యవస్థల మీద ప్రభుత్వానికి సరైన జవాబుదారితనం లేకపోవడం. రాజ్యాంగం మీద పట్టున్న వ్యక్తులు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేయగలరు, అది చదువుకున్న యువతకే సాధ్యం, యువత సాధారణంగా సినిమాలు చూడటానికి, ఫోన్లు మాట్లాడడానికి, గ్రౌండ్లో ఆడటానికి, కాలేజీలలో అమ్మాయిలా చుట్టూ తిరగడానికి మాత్రమే పనికి వస్తారు అనేది కొంతమంది ప్రజల్లో ఉండే ఆలోచన, కానీ వారు తలుచుకుంటే ఏదైనా సాధించాగలరని ఢిల్లీ కేంద్రంలోని జంతర్మంతర్ లో జరిగిన జెన్ జీ ఉద్యమం ద్వారా సాధ్యమైంది, భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి భారత పౌరునికి ప్రశ్నించే హక్కు ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపి ప్రశ్నిస్తే ఆ వ్యవస్థ యొక్క పని తీరు మారుతుందని తద్వారా ఆ వ్యవస్థ బలోపేతం చెందుతుందని ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు విద్యార్థి లోకం తమ వ్యవస్థలో జరిగిన లోపాన్ని ఎత్తి చూపింది కాబట్టి విజయాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచింది. ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతాము అప్పటినుండి వ్యవస్థల సక్రమంగా పనిచేయటం మొదలుపెడతాయి. యువత మేలుకో -నీ దేశాన్ని యెలుకో.
వ్యాసకర్త
తెల్లం. రాహుల్
ఉపాధ్యాయులు
ఏలూరు జిల్లా, భీమడోలు
0 కామెంట్‌లు