అంతిమయాత్రలో వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకుల నివాళులు
సీపీఐ గుండాల మండల కార్యదర్శి వాగబోయిన రమేష్ మాతృమూర్తి మృతికి సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సంతాపం.
గుండాల మండలం జులై 31 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
సీపీఐ గుండాల మండల కార్యదర్శి వాగబోయిన రమేష్ మాతృమూర్తి హఠాత్తుగా మృతి చెందడం పట్ల సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాగబోయిన కుటుంబానికి ఇది తీరని లోటని పేర్కొంటూ, ఆ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు.
మృతురాలి అంతిమయాత్రలో సీపీఐ పినపాక నియోజకవర్గ కార్యదర్శి సారెడ్డి పుల్లారెడ్డి పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అంతిమయాత్రలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతురాలికి తమ తుదినివాళులు అర్పించారు. న్యూడెమోక్రసీ నాయకుడు ముక్తి సత్యం, గుండాల గ్రామ సర్పంచ్ కోరం సీతారాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊకె బుచ్చయ్య, ఖదీర్, అజయ్, టీడీపీ నాయకులు తోలెం సాంబయ్య, అప్పారావు, మల్లయ్య, మదన్న, బీఆర్ఎస్ నాయకుడు తెల్లం భాస్కర్, గడ్డం వీరన్న, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు షారోజ్, మాస్ లైన్ నాయకులు కృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు హాజరై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అంతిమ సంస్కారాలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థుల సమక్షంలో నిర్వహించారు.
0 కామెంట్‌లు