ఎమిలీ పాఠశాలలో ఉచిత విద్య కై దరఖాస్తు చేసుకోండి.... - పరిమిత సీట్లు మాత్రమే - దరఖాస్తుకు చివరి తేదీ జూలై 10 - ఎంపిక ప్రక్రియ,పరీక్ష నిర్వహణ- కరస్పాండెంట్ ములకలపల్లి గోపీనాథ్.

ఎమిలీ లో ఉచిత విద్యకై దరఖాస్తు చేసుకోమని పరిమిత సీట్లు మాత్రమే ఉంటాయని మండలంలోని తల్లిదండ్రులకు పాఠశాల కరస్పాండెంట్ ములకలపల్లి గోపీనాథ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడు నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందజేస్తున్నమని వితంతువు,ఒంటరి మహిళ, పురుషుడు,ఎవరి సంరక్షణలో అయినా పిల్లలు పెరుగుతున్నట్లయితే మండలంలో ఎక్కడి నుంచైనా మా పాఠశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులన్నిటిని పరిశీలించిన పిదప అందరికీ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని అన్నారు.ఎంపికైన విద్యార్థులు 1వ తరగతి నుండి నుండి 7 వతరగతి వరకు ఉచితంగా విద్యను అందిస్తామని అన్నారు. ఎంపిక అయిన వారు కేవలం పుస్తకాలు,యూనిఫామ్ మాత్రమే బయట తీసుకోవాలని, విద్యను మాత్రం పూర్తిగా ఉచితంగా అందిస్తామని, చదువు కొరకు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.కాబట్టి ఈనెల 10వ తేదీ లోపు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పరీక్ష నిర్వహణ తేదీ గురించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఫోన్లో సమాచారం అందిస్తామని గడువు తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. వివరాలకు 99124 67858,  9182202087 నెంబర్లను సంప్రదించాలని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు