కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సింధుజ ముఖ్యంగా పాల్గొని యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ప్రతిరోజూ కొంత సమయం యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కష్టపడి పనిచేసే ఉపాధి హామీ కార్మికులకు యోగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
అనంతరం సర్పంచ్ సింధుజతో పాటు ఉపాధి హామీ కార్మికులు యోగా ఆసనాలు చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, కార్మికులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు