ఘనంగా సచిన్ టెండూల్కర్ జన్మదిన వేడుకలు

మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో Sachin Tendulkar జన్మదిన వేడుకలను సచిన్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రికెట్ గాడ్‌గా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా వాకర్స్ క్లబ్ సభ్యులు, చిన్నారులు కలిసి ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ పీడీలు, పీఈటీలు కలిసి కేక్ కట్ చేసి సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు క్రీడల ప్రాముఖ్యతను వివరించి, సచిన్ టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని కృషి చేస్తే విజయాలు సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు