రేపు పినపాకలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు
పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపు ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ శిబిరానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు హాజరై ప్రజలకు వైద్య సేవలు అందించనున్నారు.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఒక సువర్ణావకాశమని వైద్యులు తెలిపారు. పినపాక ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ దుర్గాభవాని తెలిపారు. శిబిరానికి వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ తీసుకురావాలని సూచించారు.
0 కామెంట్‌లు