పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ ను ప్రజలు వినియోగించుకోవాలని పినపాక కాంగ్రెస్ మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం అన్నారు. ఆయన వెంట భూపాలపట్నం సర్పంచ్ తోలెం స్వప్న, పినపాక సర్పంచ్ అరిగల అలివేలు ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. పినపాక వైద్యురాలు దుర్గ భవాని ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. ప్రజలు వైద్యులను సంప్రదించి వారి వారి సమస్యలను తీర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక సర్పంచ్ అరిగల అలివేలు, భూపాలపట్నం సర్పంచ్ తోలేం స్వప్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొట్టేముక్కలు స్వతంత్ర రెడ్డి, ఎస్కే యాకూబ్ పాషా, బోడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు