ఎల్చిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోలిశెట్టి సత్తిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని స్మరించుకున్నారు. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 కామెంట్‌లు