నాగర్‌కర్నూల్,నవంబర్,16,(ఎస్ బి న్యూస్):నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామం సమీపంలో శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది.
శ్రీశైలం వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు వేగాన్నినియంత్రించుకోలేక రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని బోల్తా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులోప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Social Plugin