మూడవ విడత ఎన్నికల సందర్భంగా సిద్దాపూర్ బొమ్మనపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ

మూడవ విడత ఎన్నికల సందర్భంగా సిద్దాపూర్ బొమ్మనపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ

నాగర్‌కర్నూల్,నవంబర్,16,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ 
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో పని చేస్తూ అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి.పాటిల్,తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రిటికల్ గ్రామపంచాయతీ బొమ్మనపల్లి పోలింగ్ స్టేషన్‌ను ఆయన మంగళ వారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా బొమ్మనపల్లి పోలింగ్ స్టేషన్‌లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ, అక్కడ విధులునిర్వహిస్తున్నపోలీస్,అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందించారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఓటర్లు ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఓటర్‌కు పూర్తి భద్రత కల్పిస్తూ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

పోలింగ్ రోజున పూర్తిఅప్రమత్తతతో విధులునిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించిన జిల్లా ఎస్పీ.. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని పేర్కొన్నారు.