చివరి దశ ఎన్నికలను పకడ్బందీగా విజయవంతంగా అమలు చేయాలని ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ ఆదేశం

చివరి దశ ఎన్నికలను పకడ్బందీగా విజయవంతంగా అమలు చేయాలని ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ ఆదేశం 

నాగర్ కర్నూల్,నవంబర్,16,(ఎస్ బి న్యూస్):

నాగర్‌కర్నూల్, 
జిల్లాలోజరుగనున్న చివరి దశ ఎన్నికలనువిజయవంతంగానిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్అధికారులను ఆదేశించారు. మూడో విడత ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను ఆయన మంగళ వారంఅచ్చంపేటలోని బర్కతుల్ల ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల పంపిణీ కేంద్రాన్నిఆకస్మికంగా తనిఖీ చేసి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్నికల సామాగ్రిని వేరు చేసిసిద్ధంచేయాలని ఆయన సూచించారు. బ్యాలెట్ పత్రాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలించి ప్యాక్ చేయాలని అధికారులకు ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది రవాణా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన.. సిబ్బంది సకాలంలో తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షణ చేయాలని తెలిపారు.

మైక్రో అబ్జర్వర్లు తమ విధులను పూర్తి బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. పోలింగ్ సామాగ్రి తరలింపులో సాయుధ పోలీసులతో తప్పనిసరిగా బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అలాగే విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటల నిరంతర సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమయానికి అందేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్, రహదారుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించిన కలెక్టర్.. అధికారుల మధ్య సమన్వయంతో పనిచేస్తేనే స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలు సాధ్యమవుతాయనివ్యాఖ్యానించారు.