డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ గొల్లగూడెంలో ఘర్షణ
అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి తన ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మాటల తూటాలు దాడులకు దారి తీసే పరిస్థితి ఏర్పడడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరు వర్గాల ప్రతినిధులు, పంచాయతీ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Social Plugin