*గుండాల మండలం డిసెంబర్ 13 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*
గుండాల మండలం లో విలేకరుల సమావేశం లో న్యూడేమోక్రసి రాష్ట్ర నాయకులు మధు మాట్లడుతూ గుండాల గ్రామ పంచాయతీ న్యూడేమో క్రసి అభ్యర్థి కోరం సీతారాములు ప్రచారం లో భాగంగా జగ్గాయి గూడెం గ్రామం లో ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో న్యూడేమోక్రసి కీ మద్దత్తు పలికిన కాంగ్రెస్ నాయకులు పొంబోయిన హరినాధ్ నూ శుక్రవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేయడం,న్యూడేమో క్రసికీ ప్రచారం చేయద్దనీ బెదిరించడం అత్యంత అప్రజాస్వామిక చర్య అని దీనిని ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు అందరూ ఖండించాలని న్యూడేమోక్రసి రాష్ట్ర నాయకులు అవునూరి మధు అన్నారు.
ప్రజల మద్దత్తు నూ పొందలేక ఓటమి భయం తోనే అధికార పార్టీ అనేక అప్రజాస్వామిక పద్ధతులకు, దౌర్జన్యం ల కూ పాల్పడుతున్నాదని దీనిని ప్రజలు గమనిస్తున్నారనీ అన్నారు.కిడ్నాప్ కూ పాల్పడిన వ్యక్తులపై తక్షణమే చట్ట పరమైన కేసు నమోదు చేయాలనీ, అరెస్ట్ చేయాలనీ, ఎన్నిక పోటీలో లేకుండా అనహర్హత వేటు వేయాలనీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యలకు బెదిరింపులకూ పాల్పడిన ప్రజలు తిప్పి కొడతారని ,గుండాల మండలం లో విప్లవ ప్రజా రాజకీయ చైతన్యం కలిగిన ఆదివాసీ ప్రజానీకం ముందు అవన్నీ దిగిదుడుపే అని అన్నారు. గుండాల గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న కోరం సీతారాములు నీతికి నిజాయితీ కీ నిలువెత్తు నిరాడంబరత కూ నిదర్శనం అని అన్నారు. గుండాల ప్రజలు అమూల్యమైన ఓటు వేసి న్యూడేమో క్రసి అభ్యర్థులనూ గెలిపించాలని కోరారు. గుండాల మండలం లో ఎన్నికల అధికారులు పోలీస్ అధికారులు స్వేచ్చ గా ప్రజాస్వామ్యయుతంగ ఎన్నికలు జరిగే విధంగా చూడాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశం లో న్యూడేమోక్రసి నాయకులు కోరం సీతారాములు, యాసారపు వెంకన్న, ఈసం కృష్ణ, ఈసం పాపరావు, బి ఆర్ యస్ నాయకులు తెల్లం భాస్కర్, గడ్డం వీరన్న, అరేం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Social Plugin