ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు రమణబాబు.
*గుండాల మండలం డిసెంబర్ 13 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*
గుండాల మండలం మొదులగూడెం గ్రామంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ప్రచార కార్యక్రమం అనంతరం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గుండాల మండల అధ్యక్షులు పూనేం రమణ బాబు మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ఐక్యతని ఓర్వవలేని కొన్ని పార్టీలు ఆదివాసి సంక్షేమ పరిషత్ పై విషం చీమ్మె ప్రయత్నాలు చేస్తున్నాయని, ప్రజలు దాని గమనిస్తూనే ఉన్నారని ప్రజలలో ఉన్న సంఘం యొక్క ఆదరణను చెడగొట్టే విధంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు, ఆదివాసి సంక్షేమ పరిషత్ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగానే కొన్ని కోణాలలో ఐక్యతని కోల్పోగొట్టాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారని గుర్తు చేశారు, ఈ యొక్క ఆదివాసి సంక్షేమ పరిషత్ ఏజెన్సీలో 29 శాఖలలో ఆదివాసులకే ఉద్యోగ అవకాశాలు కల్పింపించిందని జీవో నెంబర్ 3 లాంటి జీవోలను తీసుకొచ్చి కొన్ని వేల ఉద్యోగాలు ఆదివాసీలకు చెందేలా చేసిందని ప్రజలు మర్చిపోలేదని, ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని నినాదం మొట్టమొదటిసారిగా ఉద్యమించిన ఏకైక సంఘం అని దాని ఆదివాసీ ప్రజలు యాదికుంచుకున్నారని దానిపైన ఇంకా హైకోర్టులో కేసు నడుస్తూనే ఉందని కేసు నెంబర్ 56 41 ఈ నెల 16వ తారీఖున జడ్జిమెంట్ కూడా ఆదివాసీలకు న్యాయబద్ధంగానే రావాలని, ఆదివాసి ప్రజలు దాని గురించి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని ఇలాంటి ఆదివాసి సంక్షేమ పరిషత్ ఎంతో ఐక్యతతో ముందుకు సాగుతుందని దాని చూసి రాజకీయ పార్టీలు వర్వలేని పరిస్థితిలో ఉన్నాయని తెలియజేశారు అలాంటి పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ సర్పంచ్ అభ్యర్థి కల్తీ రాధా, మండల నాయకులు పూనేం వసంత్, కల్తీ జోగయ్య,మొకాళ్ళ కృష్ణ, సుదర్శన్, ఈశం చలపతి ఈసం చలపతి, సుధాకర్ సనప నర్సయ్య,సనప రాజు, తదితరులు పాల్గొన్నారు.
Social Plugin