పినపాక మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డ్ మెంబర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం సాయంత్రం పినపాక మండలం ఉప్పాక గ్రామపంచాయతీలో పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు . కాంగ్రెస్ బల పరిచిన అభ్యర్థి బాబురావు, తోపాటు 8 వార్డుల్లో అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గుర్తుచేసుకొని ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Social Plugin