సభలకు ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి - తాసిల్దార్ గోపాలకృష్ణ


స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో సభలు, ర్యాలీలకు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని పినపాక తాసిల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం పినపాక తాసిల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ స్థానికల నేపథ్యంలో గ్రామాల్లో నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు రాజకీయ పార్టీలు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఆయా పార్టీల నేతలు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రచారాలు నిర్వహించుకోవాలని కోరారు.