అశ్వాపురంలో సర్పంచ్ వార్డు మెంబర్లకు నామినేషన్ దాఖలు...

పినపాక ఎమ్మెల్యే పాయం గారి ఆశీస్సులతో అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ దాఖలు -:ఓరుగంటి బిక్షమయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు
 
ఈ రోజు అశ్వాపురం గ్రామపంచాయతీ ఎన్నికల్లో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్ధిగా కలేటి వీరయ్యతో పాటు వార్డు అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా MLA పాయం వెంకటేశ్వర్లు గారు వారికి శుభాకాంక్షలు తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్ష్మయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి ఓరుగంటి రమేష్ బాబు, మట్టా వీరభద్రారెడ్డి, గొల్లపల్లి నరేష్, హర్ష నాయక్, కోలా శశికాంత్ తదితరులు పాల్గొన్నారు