ఆనందోత్సవాల మధ్య సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం , సారపాక లోని సెయింట్ తెరిసా పాఠశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు వేదికైంది . సెయింట్ తెరిసా పాఠశాలలో 1991నుండి 2001 సంవత్సరం వరకు కలిసి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు .25 సంవత్సరాల తర్వాత ఆనందోత్సవాల మధ్య సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో కలుసుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, పదవ తరగతి తర్వాత ఉన్నత చదువులు చదివి ఉద్యోగరీత్యా కొంతమంది వ్యాపార రీత్యా ,కొంతమంది వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారని వారందరిని ఇక్కడ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఉత్సవాలు జరపడం వలన మిత్రుల కష్టసుఖాలు తెలుసుకుని మేమున్నామ్మనే నమ్మకాన్ని అందరిలో కలిగించవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో 1991 నుండి 2001 వరకు చదివిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు
Social Plugin