పినపాక :పినపాక మండలం పాండురంగాపురం గ్రామంలో ఆర్టీసీ బస్సు , ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంపై ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు విచారణ చేపట్టారు. శనివారం ఈ బయ్యారం ఎస్సై సురేష్ తో కలిసి ప్రమాదవ స్థలాన్ని మరోమారు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించడమే కాక స్థానికులను అడిగి వివరాలు రికార్డు చేశారు. పక్కనే లింకింగ్ రోడ్డు ఉండడంతో లింక్ రోడ్ నుంచి వచ్చే ప్రయాణికులు ప్రధాన రహదారి గుండా వచ్చే వాహనాలను గమనించకుండా అదే వేగంతో రావడంతో ప్రమాదం జరుగుతుందని తెలియజేశారు. కావున లింక్ రోడ్డు దాటేటప్పుడు ఇప్పటిదాకా రహదారిని పరిశీలించి రహదారి దాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ దిలీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Social Plugin