- మండలంలో జరుగుతున్న శానిటేషన్ పనులు, నర్సరీలు పరిశీలన పినపాక:పేదలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు గృహాలను అందించడం లక్ష్యంగా పీఎం ఆవాస్ యాప్ లో ఆన్లైన్ చేస్తున్నామని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన పినపాక మండల పరిధిలో చెగర్శల, దుగినేపల్లి , జానంపేట, పాండురంగాపురం గ్రామపంచాయతీలో ఆయా గ్రామ సెక్రెటరీ తో కలిసి పర్యటించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీఎం ఆవాస్ యాప్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా, అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం దుగినెపల్లి, జానంపేట జిపి లలో నర్సరీ ఇలాంటి పరిశీలించారు. రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని జానంపేటలో పరిశీలించారు. చెగర్శల గ్రామంలో డంపింగ్ యార్డ్ పరిశీలించారు. సెక్రటరీలు తమ విధులలో అలసత్వం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీలు ఖాజా హుస్సేన్, ఆదినారాయణ, సాంబశివరావు, అశోక్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Social Plugin