సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీటెస్ట్‌ జన గణనను సమర్థంగా నిర్వహిస్తున్నాం - తహసిల్దార్ గోపాలకృష్ణ

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీటెస్ట్‌ జన గణనను సమర్థంగా నిర్వహిస్తున్నాం 
- తహసిల్దార్ గోపాలకృష్ణ 
పినపాక:సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీటెస్ట్‌(ముందస్తు పరిశీలన సర్వే) జన గణనను సమర్థంగా నిర్వహిస్తున్నామని పినపాక తహసిల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. శనివారం నుండి ప్రారంభమైన సర్వేను ఆయన పినపాక మండలం ఈ బయ్యారం, పినపాక, తోగుడెం గ్రామాలలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027లో నిర్వహించే జన గణన కోసం ముందస్తు సర్వే నిర్వహించేందుకు దేశ వ్యాప్తంగా నాలుగు చార్జెస్‌ మండలాలను ఎంపిక చేయగా, ఇందులో పినపాక మండలం ఒకటన్నారు. ముందస్తు సర్వే పూర్తిగా డిజిటలైజేషన్‌ ద్వారా జరుగుతుందన్నారు. గతంలో జన గణన మ్యాప్‌ల ద్వారా జరిగేదన్నారు. ప్రస్తుతం డిజిటల్‌ లేఅవుట్‌, హెచ్‌ఎల్‌వో యాప్‌ ద్వారా చేస్తున్నట్టు తెలిపారు. ఈ సర్వే కోసం ఈ ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ పూర్తి చేసామని తెలిపారు. శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఈ నెల 15(శనివారం) నుంచి 30 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి ఇంటిని సందర్శించి జియో ట్యాగింగ్‌ చేస్తున్నారని తెలిపారు. జియో ట్యాగింగ్‌ చేసిన ఇంట్లోని వసతుల వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు . వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌ మధ్య కాలంలో కుటుంబ సభ్యుల వివరాలపై సర్వే చేయాలన్నారు.ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ముందస్తు సర్వేను ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు పక్కాగా నిర్వహించాలని తెలిపారు. సర్వే నిర్వహణలో వచ్చే సందేశాలు, సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు టెక్నికల్‌ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. సర్వేలో తలెత్తిన సమస్యలను టెక్నికల్‌ అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తారన్నారు. ముందస్తు సర్వేను ప్రత్యేక శ్రద్ధతో చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టాటిస్టికల్
డిప్యూటీ డైరెక్టర్ డి సుబ్బరాజు , స్టాటిస్టికల్ ఆఫీసర్ సిహెచ్ సతీష్, కుమారి హిమవర్ష, కుమారి హరిత, ఏ వినయ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.