నాగర్‌కర్నూల్ జిల్లా – అచ్చంపేట మండలం
పల్కపల్లి గ్రామంలో గంజాయి కలకలం చెలరేగింది. గ్రామానికి చెందిన నాగనులు మధు గంజాయి కొనుగోలు చేసేందుకు అధిక ధరలు భరించలేక, తన ఇంటి పెరట్లోనే మొక్కలు సాగు చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ ప్రాంతంతో పాటు హైదరాబాద్ నుంచి కూడా గంజాయి విత్తనాలు సేకరించి, గత రెండేళ్లుగా ఇంటి వద్దే సాగు చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
స్థానికుల అనుమానం మేరకు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 20 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Social Plugin