మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే పాయం

మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం
- ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం 
పినపాక :తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పినపాక మండల కేంద్ర రైతు వేదికలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని చీరలను మహిళలకు అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాయం మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళల ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల సహాయం, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకంలో 200 యూనిట్లు కరెంటు ఉచితం, రూ.500కు గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు ఆర్థికబలం కల్పించే చర్యలు ప్రభుత్వం చేపట్టిందని వివరించారు.
ఇందిరమ్మ చీరల పంపిణీని దశలవారీగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు మొదటి దశగా, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 9 వరకు రెండో దశగా అమలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బీ. తాతారావు, తహసీల్దార్ జి. గోపాలకృష్ణ, ఎంపీఓ కే. వెంకటేశ్వరరావు, ఐకేపీ ఏపీఎం ఊటుకూరు విజయలక్ష్మి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సావిత్రి, హౌజింగ్ ఏఈ వినీత, మెడికల్ ఆఫీసర్ దుర్గాభవాని, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జి. రామనాథం, గంగిరెడ్డి వెంకటరెడ్డి, ఉడుముల లక్ష్మిరెడ్డి, పేరం వెంకటేశ్వరరావు, దాట్ల రాజేష్, కొర్స ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.