పినపాక
పినపాక మండలం, ఇ.బయ్యారం క్రాస్-రోడ్:
ఎక్సలెంట్ బాషా హైస్కూల్‌లో నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం బాలల దినోత్సవ ప్రధాన వేడుకలు ఘనంగా నిర్వహించారు.వేడుకలను ఉద్దేశించి ఛైర్మన్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో శారీరక–మానసిక శక్తిని పెంపొందిస్తాయన్నారు. పోటీ భావన, ఐక్యత, క్రమశిక్షణను అభివృద్ధి చేస్తాయన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు విద్యార్థులకు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. విశిష్ట అతిథులైన మండల విద్యాశాఖ అధికారి నాగయ్య, బయ్యారం సబ్ ఇన్స్పెక్టర్ పి. సురేష్, కరకగూడెం సబ్ ఇన్స్పెక్టర్ పి.వి.ఎన్.రావు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఉన్నత భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఆరు రోజుల పాటు సీనియర్–జూనియర్ విభాగాల్లో నిర్వహించిన కబడ్డీ, డ్రాయింగ్, లెమన్ & స్పూన్, పరుగు పందెం తదితర పోటీల్లో విజేతలకు అతిథుల చేత బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులు, సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో ఎక్సలెంట్ విద్యాసంస్థల డైరెక్టర్లు ఖాదర్ షరీఫ్, యూసఫ్ షరీఫ్, యాకుబ్ షరీఫ్, ఎం.వి. నర్సారెడ్డి, నరేంద్ర, సురేష్, ఇంఛార్జ్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Social Plugin