- అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లులు అందించాలి
- రాజు యువ వికాసం జాడ తెలపాలి
- పోడు సాగుదారులపై అటవీ శాఖ అధికారులు దాడులు ఆపాలి
పినపాక
ప్రజా పోరాటాలకు సిపిఎం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని , పేద ప్రజలకు ఎప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అన్నవరం కనకయ్య అన్నారు. సోమవారం
పినపాక మండలం చింతలపాడు గ్రామంలో సిపిఎం శాఖ కార్యదర్శుల సమావేశం జరగింది. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకత్వం చేశారు. గ్రామ స్థాయి సమస్యల నుండి జిల్లా స్థాయి ప్రజా సమస్యల వరకు విస్తృతంగా చర్చించి, ప్రజల అభ్యున్నతికి పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన పలు సమస్యలపై మాట్లాడారు. ఇసుక సొసైటీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బోనస్‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం తీవ్రంగా ఖండించారు. ఇసుక తవ్వకాలలో శ్రమించిన కార్మికులకు సరైన పారితోషికం చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే పెండింగ్ బోనస్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదలను కాపాడే ప్రభుత్వమైతే, వారి హక్కులను కాపాడాలి గానీ ఇలా నిర్లక్ష్యం చేయకూడదన్నారు. గిరిజనులకు ఇంకా ఇసుక బోనస్ ఇవ్వకపోవడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అలాగే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అర్హత ఉన్న పేద కుటుంబాలకు ఇళ్లు కట్టివ్వకపోవడం వల్ల అనేక కుటుంబాలు ఇప్పటికీ గుడిసెల్లోనే జీవనాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిజమైన అర్హులకే అందాలని ఆయన స్పష్టం చేశారు.రాజీవ్ యువ వికాసం పథకానికి యువకులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఆజాడలు ఇవ్వకపోవడం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పథకంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు.అటవీశాఖ అధికారులు పోడు సాగుదారులపై కొనసాగిస్తున్న దాడులను వెంటనే ఆపాలని, పోడు సాగుపై ప్రభుత్వపు తుది నిర్ణయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోడు సాగుదారుల జీవనోపాధి రక్షించడంలో పార్టీ తమతో ఉందని భరోసా కలిపించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, మడివి రమేష్ , దడిగల వెంకన్న, శాఖ కార్యదర్శులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు
Social Plugin