నాగర్ కర్నూల్,నవంబర్,26,(ఎస్ బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఆర్డీవో కొణిదెల మాధవిని భూ అక్రమాల ఆరోపణలనేపధ్యంలో ప్రభుత్వం బదిలీ చేసింది. టీఆర్‌పి(తెలంగాణ రాజ్యాధికార పార్టీ )ఫిర్యాదులపై రెవెన్యూ ఉన్నతాధికారుల విచారణ అనంతరం జీఓ ఆర్టీ నం.666 (22.11.2025) జారీ కాగా, ఆమెనుపాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్,భూసేకరణఅధికారిగానియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త ఆర్డీవోగాయాదగిరిని నియమించారు.
అయితే బదిలీ చేసిన ఉత్తర్వులు వచ్చినా, చార్జ్‌ను అప్పగించకుండా మాధవి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. గతం లో కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లబ్ధిదారులపై అన్యాయం, 26–27 సర్వే నంబర్ల భూముల రీ-సేల్ వివాదం వంటి పలు అంశాల్లో ఆమెపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ భూ వివాదంలో స్థానిక ఎస్‌ఐ విజయ్‌భాస్కర్ కూడా అక్రమాలకు సహకరించారన్న అభియోగాలపై నారాయణపేట ఎస్పీకార్యాలయానికి అటాచ్ చేశారు.
“భూ అక్రమాలకు అనుకూలంగా వ్యవహరించిన మాధవిని వెంటనే సస్పెండ్ చేయాలి” అని టీఆర్‌పి కన్వీనర్ బీసం. ఆంజనేయులు డిమాండ్ చేశారు. బదిలీ ఆర్డర్ రద్దయిందని ఆర్డీవో ప్రచారంచేస్తున్నారని,ఇదిప్రజాస్వామ్యానికివిరుద్ధమని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఆర్డీవో బదిలీ వార్త అచ్చంపేటలో మంగళ వారం భూ బాధితుల్లో సంతోషమైన సంబరాలను రేకెత్తించింది. 26–27 సర్వే నంబర్ల ప్రాంత ప్రజలు అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచాను పేల్చి, మిఠాయిలు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. “ఇలాంటి అక్రమాలకు పాల్పడేఅధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలుతీసుకోవాలని ఇలాంటి అధికారుల వల్ల ప్రజలెవరూ కూడా వారు డిమాండ్ చేశారు.
Social Plugin