అటవీశాఖఅధికారిపై అధికార పార్టీ నేత కుమారుల దాడి....అచ్చంపేట అటవీ శాఖకార్యాలయంలో ఉద్రిక్తత

అటవీశాఖఅధికారిపై అధికార పార్టీ నేత కుమారుల దాడి
అచ్చంపేట అటవీ శాఖకార్యాలయంలో ఉద్రిక్తత

నాగర్ కర్నూల్, అక్టోబర్ 31(ఎస్ బి న్యూస్):నాగర్ కర్నూల్ జిల్లా 
అచ్చంపేట అటవీశాఖ కార్యాలయంలో ప్రభుత్వాధికారిపై దాడి జరిగిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. అచ్చంపేట అటవీశాఖ డివిజన్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహి స్తున్న రాజుపై అధికార పార్టీకి చెందినమద్దిమడుగు ఛైర్మన్ రాములుకుమారులు వెంకట్ రామ్, చందుతో పాటు మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులువిచక్షణారహితంగా దాడి చేసినట్లుసమాచారం.అధికార బాధితుడు రాజు తెలిపిన వివరాల ప్రకారం కార్యాలయంలో వి ధి నిర్వహణ లో పని చేస్తున్న నన్ను శుక్రవారం కార్యా లయం నుండి బయటకు లాగి కొట్టేందుకు ప్రయత్నించారనిఆయనఆరోపించాడు. నన్నుఎందుకుకొడుతున్నారనిఅడిగినా నాకేమీసమాధానం చెప్పకుండా సుమారు పది నిమిషాల పాటు నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. నా మొబైల్ ఫోన్‌ను కూడా ధ్వంసం చేశారు” అని ఆయనవాపోయారు.కార్యాలయ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా దాడి చేసేవారు వినిపించుకోలేదని ఆయన తెలిపారు. అనంతరంపోలీసులు వస్తున్నారని తెలిసి దుండగులు అక్కడి నుండి పారిపోయారని.
దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజు పోలీసులను ఆశ్రయించారు. వెంటనేపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు.