తెలంగాణపై ‘మొంథా’ తుపాను ప్రభావం తీవ్రం

ప్రస్తుతం మొంథా తుపాను ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ మీదుగా ప్రయాణిస్తోంది. బుధవారం మధ్యాహ్నం నాటికి ఇది ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే, తుపాను ప్రభావంతో గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని అంచనా. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది.

🔴 రెడ్ అలర్ట్ జిల్లాలు: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నాగర్‌కర్నూల్
🟠 ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు: హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్
🟡 ఎల్లో అలర్ట్ జిల్లాలు: మిగిలిన 11 జిల్లాలు

తుపాను ప్రభావంతో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.